చక్కెరతో పోల్చితే బెల్లమే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కానీ చాలా మంది బెల్లం కంటే చక్కెరనే ఎక్కువగా తింటుంటారు. 

మీకు తెలుసా.. బెల్లం ఆరోగ్య ప్రయోజనాల భాండాగారం. 

దీనిలో ఐరన్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

కడుపులో గ్యాస్, చెడు శ్వాసను దూరం చేయడానికి సహాయపడుతుంది. 

బెల్లాన్ని నేరుగా తినేవారు చాలా మంది ఉన్నారు. కానీ మీ ఆహారంలో బెల్లం జోడించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.

రోజూ గ్లాస్ లేదా కప్పు పాలలో కొంత బెల్లాన్ని కలిపి తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. 

బెల్లాన్ని కేవలం తీపివంటకాల్లోనే కాదు.. కారం కూరల్లో కూడా వాడొచ్చు. రుచిని పెంచడానికి బెల్లాన్ని పప్పులో కూడా వేస్తారు.

హల్వాలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. ఇది మీ ఆహారంలో ఇనుమును పెంచుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చూర్ణం చేసిన బెల్లం వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఆరోగ్యకరమైన ప్రేగు కదలికకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

బెల్లాన్ని కొద్దిగా నెయ్యితో కరిగించి తర్వాత తెల్ల నువ్వులు నువ్వులు కలపండి. ఈ మిశ్రమాన్ని లడ్డూగా తయారు చేయండి. ఈ బెల్లం లడ్డూలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇవి చాలా మంచివి.