ప్రతిరోజూ ఎక్కువ టీ, కాఫీ తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. కెఫిన్ అధికంగా ఉండటం వల్ల నిద్ర సమస్యలు, ఆందోళన, గుండె చప్పుళ్లు పెరగడం, బ్లడ్ ప్రెజర్ అధికం కావడం జరుగుతుంది.

టీ, కాఫీ తరచుగా తాగడం వల్ల పళ్ళపై మచ్చలు పడటం.

రోజూ తాగకపోతే తలనొప్పి, అలసట, చిరాకు రావడం.

ఎక్కువ కెఫిన్ వలన కిడ్నీలపై ఒత్తిడి పడటం.

గ్యాస్, ఆమ్లత్వం (అసిడిటీ), కడుపు మంట కలగడం.

టీ, కాఫీ మల మూత్ర విసర్జనను పెంచడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోవడం.

గుండె చప్పుళ్లు వేగంగా కొట్టుకోవడం.

కెఫిన్ కారణంగా నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో అంతరాయం కలగడం.

టీ లోని టానిన్స్ వలన ఆహారంలో ఉండే ఐరన్ శోషణ తగ్గిపోవడం.