ఒక అరకప్పు నీటిలో చిన్నచిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం.

ఈ ఔషధ మూలికను మగవారిలో నపుంసకత్వం తగ్గించేందుకు కూడా వాడతారు. దీనిని కామాతురత పెంచడం, నిరోధకంగా కూడా వాడవచ్చు.

శ్వాస సంబంధ అంటువ్యాధులను నివారించడానికి, శ్వాస ఉత్తేజపరిచేందుకు, కఫము తగ్గించటానికి బాగా పనిచేస్తుంది.

తేనే, అల్లంతో కూడిన ఇంగువతో దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, ఉపశమనం.

ఇంగువను డయాబెటిస్ వైద్యంలో వాడతారు. ఇది క్లోమ కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

అధిక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా రక్షిస్తుంది. తక్కువ రక్తపోటుకు సహాయపడుతుంది.

ఇంగువ నరాలను ఉత్తేజితం చేస్తుంది. మూర్ఛ, వంకరలు పోవటం, సొమ్మసిల్లుట, ఇతర నాడీ సమస్యమనుండి రక్షణ కల్పిస్తుంది.

నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రేన్‌, తలనొప్పులను తగ్గిస్తుంది.

నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి ఒక అద్భుతంగా పనిచేస్తుంది.

ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, చర్మ వ్యాధులకు ఇంగువ సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకో బోయేముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది.