ఇందులో బి12, ఫోలిక్ ఆసిడ్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి.
ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశంలోని కొలెస్ట్రాల్‌ని కూడా ఇది కడిగేస్తుంది.
ఈ రసం రెగ్యులర్‌గా తీసుకుంటే.. తలసేమియా రోగ నివారణకు ఉపకరిస్తుందని పరిశోధనల్లో తేలింది.
క్రమం తప్పకుండా గోధుమ గడ్డి రసం తాగితే.. రోగనిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యం కుదుట పడుతుంది.
బరువు పెరగాలనుకునే వారు.. ఈ జ్యూస్ తాగితే ఉత్తమం. ఇది శరీరంలోని మెటబాలిజాన్ని సరిచేస్తుంది.
ఈ రసంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, బీటా కెరోటిన్, బీ-సీ-ఈ విటమిన్స్.. క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి.
రోజూ ఒక గ్లాసు రసం తాగితే.. చర్మంపై ముడుతలు రావు. చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుతుంది.
ఈ రసం తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
అయితే.. ఈ రసం నిర్నీత పరిణామంలోనే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.