టమాటాల్లో ఉండే లైకోపీన్ అనే పోషకం.. కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటుంది

టమోటాలో ఉండే పొటాషియం.. రక్తపోటు నుంచి ఉపశమనం కలిగిస్తుంది

రక్తం గడ్డ కట్టడాన్ని, అలాగే గుండె సంబంధిత వ్యాధుల్ని టమోటా నివారిస్తుంది

టమోటాలో ఉండే క్రోమియం.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది

టమోటాలో విటమిన్ కే, క్యాల్షియం, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా ఉంచుతాయి

టమోటాలో విటమిన్ సీ అధిక మోతాదులో ఉంటుంది, ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

టమోటాలో ఉండే బీ, ఈ విటమిన్లు.. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి

టమోటాల్లో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్.. కళ్లకు మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి

టమోటాల్లోని బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. చర్మ కణాల్ని రిపేర్ చేసి, ముసలితనం రాకుండా కాపాడుతాయి

టమోటాలో ఉండే విటమిన్ ఏ.. జుట్టును బాహ్య నష్టాల నుంచి రక్షిస్తుంది