సూర్యకాంతి గింజలు పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆరోగ్యకరమైన అల్పాహారం. వీటిలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు హృదయ ఆరోగ్యాన్ని కాపాడి, కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును నియంత్రిస్తాయి

 మాగ్నీషియం, విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటంతో హృదయానికి మేలు చేస్తాయి.

 చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచుతాయి.

పొటాషియం, మాగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు సరిగా ఉంచుతుంది.

 యాంటీఆక్సిడెంట్లు, జింక్ ఉండటంతో ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది

విటమిన్ E, ప్రోటీన్, ఫ్యాటి ఆమ్లాలు ఉండటంతో చర్మం మెరుగ్గా, జుట్టు దృఢంగా ఉంటుంది.

ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతాయి.

ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది.

యాంటీఆక్సిడెంట్లు, జింక్ ఉండటంతో ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని తగ్గించి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

 ట్రిప్టోఫాన్ ఉండటం వల్ల మానసిక ప్రశాంతత, మంచి నిద్ర లభిస్తుంది.