చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్‌తో పాటు మరిన్ని అమైనో ఆమ్లాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి

చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. అధిక వేడితో అలసిపోయినప్పుడు, చెరకు రసం తాగితే మంచిది

చెరకు రసంలోని యాంటీఆక్సిడెంట్లు.. కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రిస్తాయి

చెరకు రసంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్.. పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తాయి. ఫలితంగా దంతాలలో పుచ్చులుండవు, నోటి దుర్వాసన దూరమవుతుంది

చెరకు రసం.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించేవారు చెరుకు రసం తాగడం మేలు

చెరుకు రసం రెగ్యులర్‌గా తాగితే.. మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో కీలకంగా పని చేస్తుంది

చెరుకు రసంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా కడుపులో ఇన్ఫెక్షన్స్, మలబద్దకం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది

చెరుకు రసంలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగసీన్ వంటి వనరులు.. క్యాన్సర్ కణాలతో పోరాడి, ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్‌లను నివారిస్తుంది

చెరుకు రసంలో గ్లైకోలిక్, అల్ఫాహైడ్రాక్సీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి కణాల ఉత్పత్తిని పెంచి, మొటిమల్ని తొలగించడంలో తోడ్పడుతాయి