మొలకలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వైద్యులు సైతం రోజు గుప్పెడు మొలకలు తినాలంటూ సూచిస్తూనే ఉంటారు.

 మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి సోపానాలు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి. కేలరీలు పెరగవు. ఇంతకన్నా స్లిమ్‌గా వుండాలనే వారికి మరేం కావాలి?

 శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు, మాంసకృతులు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ప్రతిరోజూ వీటిని గుప్పెడు తీసుకోవాలి.

మొలకలలో ఎ, సి, బి 1, బి 6, కె  విటమిన్లు, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. 

మొలకలలో పీచు, ఫోలేట్ ,ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. 

మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. మొలకెత్తిన తర్వాత గింజల్లో చాలా వరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది.

నిజానికి వీటిలో 35 శాతం వరకు మాంసకృతులు ఉంటాయి. మాంసం తినడం వల్ల వచ్చే కొవ్వును, కొలెస్టరాల్‌ను, క్యాలరీలను తగ్గిస్తుంది.

మొలకలను తినడం వ‌ల్ల జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది.

 మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు, చర్మం, నెయిల్స్  మొదలగునవి పెరగడానికి సహాయపడుతుంది.

మొలకలను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఆల్కైజెస్‌ను అందిస్తుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.

ముఖ్యంగా ప్రాణాంతక‌ వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో ఎసిడిటీని నివారిస్తాయి.