మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

నాణ్యమైన నిద్ర వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్చొచ్చని అంటున్నారు వైద్యులు. 

ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయేందుకు ప్రయత్నించాలి.

పడకగది వాతావరణాన్ని ఆహ్లోదకరంగా ఉండేటట్లు చూసుకుంటే.. మంచి నిద్ర పడుతుంది.

రాత్రి వేళ ఎక్కువసేపు టీవీ, మొబైల్ చూడకుండా ఉండాలి.

రాత్రి పూట తక్కువ మోతాదులో.. వేగంగా డిన్నర్ చేసేయాలి.

   క్రమం తప్పకుండా వ్యాయామం లేదా ధ్యానం చేయాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం యోగా, మార్నింగ్ వాక్ వంటివి చేయాలి.

శారీరక, మానసిక ఆరోగ్యాల మీద ఇంత ప్రభావం చూపుతున్న నిద్ర పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిపుణుల సూచనల ప్రకారం నిద్రపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు.