ఒక గ్లాస్‌ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి, రాత్రంతా నానబెట్టి, ఉదయం తాగాలి. ఫలితంగా.. శరీరంలో ఉండే నీరు బయటకు పోయి, అధిక బరువు తగ్గుతారు.

కుంకుమ పువ్వు, తేనెను కలిపి తీసుకుంటే.. స్త్రీలలో వచ్చే గర్భాశయ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

గోరు వెచ్చని పాలలో పటికబెల్లం, కుంకుమ పువ్వులను బాగా కలిపి తాగితే.. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీలలో సంతాన లోపం సమస్యలు తగ్గుతాయి.

ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో 2 చిటికెల కుంకుమ పువ్వు, కొద్దిగా పటిక బెల్లం వేసి తాగితే.. గుండె జబ్బులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.

కుంకుమ పువ్వులో క్రోసిన్‌, క్రోసెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని త‌గ్గించి, మ‌న‌స్సును ప్రశాంతంగా మారుస్తాయి. 

కుంకుమ పువ్వులో ఉండే పోషకాలు.. మెద‌డు క‌ణాల‌ను సంరక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి.

తీవ్రమైన ఆక‌లి స‌మ‌స్య, శ‌రీరంలో వాపులు తగ్గించడంలో.. కుంకుమ పువ్వు దోహదపడుతుంది.

కుంకుమ పువ్వులో క్యాన్సర్ పై పోరాడే ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీన్ని తీసుకుంటే.. పెద్ద పేగు క్యాన్సర్‌, స్కిన్‌, ప్రోస్టేట్‌, లంగ్స్‌, బ్రెస్ట్‌, గ‌ర్భాశ‌యం త‌దిత‌ర క్యాన్సర్ క‌ణాలు న‌శిస్తాయి.

కుంకుమ పువ్వును గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే.. మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.