ఎండుద్రాక్షతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

ఎండుద్రాక్షలో ఉపయోగకరమైన కరిగే ఫైబర్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, క్రమబద్ధతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

ఎర్ర రక్తకణాలను తయారు చేయడానికి, శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి అవసరమైన ఐరన్, కాపర్, విటమిన్లు ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి.

ఎండుద్రాక్షలోని ఐరన్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు.. కడుపులో ఆమ్లత స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

ఎండుద్రాక్షలో తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం ఉంటాయి. ఇవి రక్తపోటుని, గుండె సంబంధిత సమస్యల్ని నివారిస్తాయి.

ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్.. శరీరాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి, అలాగే క్యాన్సర్‌ను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

ఎండుద్రాక్షలో ఉండే పాలీఫెనాల్స్.. కళ్లలోని కణాలను ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడతాయి. కంటిశుక్లం వంటి కంటి రుగ్మతల నుండి కూడా రక్షిస్తాయి.

ఎండుద్రాక్షలోని విటమిన్ సి, సెలీనియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మ కణాలను యవ్వనంగా ఉంచడంతో పాటు వృద్ధాప్య కణాలను నిరోధిస్తాయి.

క్రమం తప్పకుండా ఎండుద్రాక్ష తింటే.. రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుందని ఓ పరిశోధనలో తేలింది.