బంగాళదుంపలో బరువు పెరగడానికి కావాల్సిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. కాబట్టి, సన్నగా ఉన్న వారు వీటిని తీసుకుంటే, బరువు పెరుగుతారు.
ఇది తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థం. పిల్లలు, పేషెంట్లు దీనిని తరచుగా తింటే.. ఇది సులువుగా అరుగుతుంది. శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది.
కడుపు మంట, గ్యాస్ట్రిక్‌తో పాటు కడుపులోని ఇతర సమస్యలను ఇది సమర్థవంతంగా తొలిగిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.
నోటి క్యాన్సర్‌ను నివారించడంలో బంగాళదుంప ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
గుండె జబ్బులను ఎదుర్కొనే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, వీటిని తరచుగా తింటే ఎంతో శ్రేయస్కరం.
బంగాళదుంప రసంలో విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.
బంగాళదుంప రసం తాగితే.. చర్మ కణాలకు రక్తం ప్రవహించి, చర్మంపై ముడతలు, మచ్చలు మాయమవుతాయి.
బంగాళదుంపలో విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్ , జింక్ వంటి చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి.
పచ్చి బంగాళదుంప ముద్దని కాలిన గాయాలకు రాస్తే.. వెంటనే ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.