పీరియడ్స్ సమయంలో బొప్పాయి గింజలతో తేనె కలిపి తీసుకుంటే.. మంట స్థాయి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి.
బొప్పాయి గింజలు, తేనె కలిపి తీసుకుంటే.. చర్మంలో పేరుకున్న విష పదార్థాలు బయటకు వస్తాయి. ముడతలు తగ్గుతాయి.
బొప్పాయి గింజల్లో చాలా ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి కండరాలను నిర్మించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.
ఈ గింజల్లో గ్లూకోసినోలేట్ అనే పదార్ధం ఉంటుంది. ఇది కణాల పనితీరును పెంచి, అలసటను దగ్గరకు రానివ్వదు.
బొప్పాయి విత్తనాలు, తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే.. వాటిల్లో ఉండే ఎంజైమ్స్ స్పెర్మ్ కౌంట్‌ను, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
క్రమం తప్పకుండా బొప్పాయి గింజలను తింటే.. విష పదార్థాలు బయటకు పోయి, కాలేయం బలంగా మారుతుంది.
బొప్పాయి గింజల్లో అనేక లిపిడ్లు, పొటాషియం ఉన్నాయి, ఇవి జీవక్రియను పెంచి, కొవ్వును తగ్గిస్తాయి. ఫలితంగా, బరువు తగ్గొచ్చు.
బొప్పాయి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.