మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్దిసేపు కునుకు తీయడం కొద్ది మందికి అలవాటు. ఆ కునుకుతో వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని పలు అధ్యయనాలు నిర్ధారించాయి. కాకపోతే ఎక్కువ సమయం నిద్రపోవడం మంచిది కాదంట.
కునుకు తీయడం కేవలం శిశువులు, చిన్న పిల్లలకే కాదు, పెద్దలకు కూడా మంచిది.
మధ్యాహ్నం నిద్రతో ఉదయం నుంచి తెలుసుకున్న అంశాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని పలు అధ్యయనాలు గుర్తించాయి.
క్లిష్ట సమస్యలు, చిక్కులు ఎదురైనా, ఇలా మధ్యాహ్నం కునుకు తీసే వారు చక్కగా పరిష్కరిస్తారట.
మధ్యాహ్నం నిద్ర వల్ల మిగిలిన రోజంతా చురుకుగా పనిచేస్తారు. అందుకు కావాల్సిన తాజాదనాన్ని సంతరించుకుంటారు.
ఉదయం నుంచి అప్పటి వరకు శ్రమించడం, భోజనం ద్వారా గ్లూకోజు స్థాయి పెరగడంతో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది కావున మధ్యాహ్నం నిద్ర వస్తుంది.
ఇక మధ్యాహ్నం నిద్ర అన్నది 10-20 నిమిషాల వరకే ఉండాలి. ముఖ్యంగా 30 నిమిషాలకు మించి నిద్రపోకూడదు. ఎక్కువైతే అది బద్ధకానికి దారితీస్తుంది.
కాఫీ ద్వారా వచ్చే హుషారు కంటే కూడా మధ్యాహ్నం కునుకుతో వచ్చే ప్రయోజనమే ఎక్కువని కొన్ని అధ్యయనాలు గుర్తించాయి.
రాత్రి ముందుగా నిద్ర పోయే అవకాశం లేని వారు మధ్యాహ్నం తప్పకుండా 20 నిమిషాలు నిద్ర పోవడం మంచిది.
ఇక మధ్యాహ్నం నిద్రతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు.
మధ్యాహ్నం కునుకుతో వచ్చే మురో ముఖ్యమైన ప్రయోజనం రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
షిఫ్ట్‌ల వారీ పనిచేసే వారికి మధ్యాహ్నం కునుకు మంచి ఫలితాలను ఇస్తుందని కూడా పరిశోధకులు తెలుసుకున్నారు.