కర్బూజలో ఉండే ఈ, కే విటమిన్స్..ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తాయి. సంతానలేమితో బాధపడేవారు ఈ పండు తీసుకుంటే మంచిది

కర్బూజలో ఉండే బీటాకెరోటిన్.. క్యాన్సర్ కణాల్ని, ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది

వడదెబ్బ నుంచి కర్బూజ రక్షిస్తుంది. ఎండల్లో బయటకు వెళ్లేవారు కర్బూజ జ్యూస్ తాగితే, మంచి ఫలితం ఉంటుంది

కర్బూజలో ఉండే ఏ విటమిన్.. కంటి సంబంధిత సమస్యల్ని దూరం చేసి, కంటిచూపుని మెరుగుపరుస్తుంది

కర్బూజలో ఉండే పొటాషియం.. గుండెకు కావాల్సిన న్యూట్రియన్స్ అందిస్తుంది. ఇది గుండెపోటు సమస్యనూ దూరం చేస్తుంది

క్రమం తప్పకుండా కర్బూజను తీసుకుంటే.. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి

కర్బూజలో ఉండే పీచు.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పైల్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

తెల్ల రక్త కణాల వృద్ధిలో కర్బూజ కీలక పాత్ర పోషించడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది