పుట్టగొడుగుల్లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి

పుట్టగొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు.. ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ ఇంకా రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి

పుట్టగొడుగుల్లోని ఫైబర్, పొటాషియం.. గుండె ఆరోగ్య పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది

పుట్టగొడుగుల్లోని బీటా-గ్లూకాన్స్.. హైపోకొలెస్టమిక్ లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించడంలో పని చేస్తాయి

కొన్ని రకాల పుట్టగొడుగుల్లో కాపర్ అధికంగా ఉంటుంది. అది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది

పుట్టగొడుగుల్లో ఉండే ఎరిటాడెనిన్, బీటా-గ్లూకాన్స్.. ఊబకాయాన్ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి

పుట్టగొడుగుల్లోని ఇర్గోథియోనైన్‌, సెలీనియం అనే కారకాలు.. గుండె జబ్బులకు, క్యాన్సర్ రోగాలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఎదుర్కొంటాయి

పుట్టగొడుగుల్లో ఉండే బి విటమిన్ల సమూహం.. మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తాయి

పుట్టగొడుగుల్లో డి-విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు. చర్మానికి కావలసిన హైడ్రైటింగ్ గుణాలూ వీటిల్లో ఉంటాయి