లిచీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది ఇన్‌ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

లిచీలో ఉండే డైటరీ ఫైబర్.. విరేచనం సాఫీగా అయ్యేలా చేసి, మలబద్దకం సమస్యను నివారిస్తుంది

లిచీలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును తగ్గించి, రక్త సరఫరాను మెరుగుపరచి, గుండె జబ్బులు రాకుండా తోడ్పడుతుంది

లిచీలో కాపర్, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాలను పెంచటంలో సహాయపడతాయి

లిచీలో ఉండే ఫైబర్.. కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు ఎంతో ఉత్తమం

లిచీలో పెక్టిన్, ఫైబర్ ఉంటాయి, ఇవి పేగుల్ని శుభ్రంగానూ, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగానూ ఉంచడంలో దోహదపడతాయి

లిచీలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు.. ఎముకల్ని బలోపేతం చేయడానికి పని చేస్తాయి

లిచీలో రాగి సమృద్ధిగా ఉంటుంది, జుట్టు ఒత్తుగా పెరగడంలో అది సహాయపడుతుంది

లిచీలో విటమిన్లు పుష్కలంగా ఉన్నందున పక్షవాతం ప్రమాదాన్ని తగ్గిస్తుంది