మల్లెల్ని మెత్తగా నూరి, తడిబట్టలో చుట్టుకొని, దాన్ని కళ్లపై పెట్టుకుంటే.. కంటి సమస్యలు దూరం అవుతాయి
మల్లెపూలు నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది, మొటిమలు తగ్గుతాయి
మల్లెపూల కషాయంలో కొంచెం నువ్వుల నూనె, కొబ్బరినూనె, బాదం నూనె కలిపి తలకు మర్దన చేస్తే.. తలనొప్పి మటుమాయమవుతుంది
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గంచే గుణం మల్లెపూలకు ఉంది. కాబట్టి, మధుమేహంతో బాధపడుతున్నవారు మల్లెపూల చాయ్ తాగితే మంచిది
కొబ్బరినూనెలో కొన్ని మల్లెపూలు వేసి రోజంతా నానబెట్టాలి. అనంతరం కాచి వడగట్టి, చల్లారాక తలకు మర్దన చేస్తే.. జుట్టు బలంగా ఉంటుంది
మానసిక బాధ, డిప్రెషన్, అతికోపం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించే గుణం మల్లెపూల సొంతం
దిండు కింద మల్లెపూలు పెట్టుకొని, సువాసన పీలిస్తే.. హాయిగా నిద్ర పడుతుంది
నంపుసకత్వం, శీఘ్రస్కలన సమస్యల పరిష్కారానికి కూడా మల్లెపూలు ఉపకరిస్తాయని అధ్యయనాల్లో తేలింది