మెదడు, నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు కావాల్సిన విటమిన్లు.. దొండకాయలో పుష్కలంగా లభిస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది కూడా!

దొండకాయలో థయామిన్ అధికాంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్‌ను గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిస్తుంది. జీవక్రియ రేటునూ పెంచుతుంది

దొండలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి

దొండకాయలో ఉండే క్యాల్షియం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. దొండకాయ ఎక్కువగా తింటే, కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి

దొండలో ఉండే యాంటీ- హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం.. వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినడం మంచిది

పచ్చి దొండకాయ తింటే.. రక్తంలో చక్కెర శాతం తగ్గి, షుగర్ వ్యాధి కంట్రోల్‌‌లో ఉంటుంది

దొండలోని పొటాషియం.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అన్ని అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరిగేలా దోహదపడుతుంది

దొండలోని విటమిన్ సి, విటమిన్ బీ1 లు.. రోగ నిరోధక శక్తిని పెంచి, చిన్న చిన్న రోగాలు దరి చేరకుండా చేస్తాయి

పచ్చి దొండకాయ తరచూ తింటే.. చర్మం అందంగా మారడంతో పాటు స్కిన్ ఎలర్జీ వంటివి దరిచేరవు

దొండకాయలోని బేటా కెరోటిన్‌ విటమిన్‌- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది