రంజాన్ మాసంలో అందరికి లభించే నోరూరించే ఆహారం హలీం. రుచికరమైన హలీంను తినడానికి ఇష్టపడతారు.

హలీమ్ భారతదేశంతోపాటు అనేక దేశాలలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ వంటకం. రంజాన్ సమయంలో హలీమ్‌కు ప్రాచుర్యం.

కాయధాన్యాలు, గోధుమలు, బియ్యం, మాంసం , సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని నెమ్మదిగా ఉడికించడం ద్వారా తయారు చేస్తారు.

హలీం లో అధిక శక్తి, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇది తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

హలీమ్‌లో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌లతో పాటు ఇతర ఆరోగ్యకరమైన అంశాలు ఉంటాయి. 

హలీమ్‌లో ఉండే మాంసం ప్రోటీన్‌లో అధికంగా ఉండేలా చేస్తుంది. తద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 

నోరూరించే హలీమ్ పలు రకరకాలుగా లభిస్తుంది. చికెన్, మటన్, ఫిష్ హలీమ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 

పోషకాహారాలలో హలీమ్ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. హలీమ్‌ను ఆరోగ్యకరమైన ఆహారంగా సూచిస్తారు.

పిస్తా హౌస్ హలీమ్ 2017 థాయ్‌లాండ్ ఫుడ్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబడింది. హైదరాబాదీ హలీమ్‌కు ప్రపంచ గుర్తింపు ఉంది. 

 డైట్ లో హలీమ్ ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం.  పోషకాలతో కూడిన భోజనం మనిషిని ఆరోగ్యంగా చేస్తుంది.