జామపండులో ఉండే ఫైబర్, పొటాషియం బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జామపండులో ఉండే ఆంటీ యాక్సిడెంట్ గుణాలు.. క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేయటంలో దోహదపడుతాయి.

జామపండులో ఉండే ఆంటీ బాక్టీరియల్ గుణాలు.. చర్మానికి సంబంచిన వివిధ సమస్యల నుంచి కాపాడుతాయి.

జామపండులోని ఔషధ గుణాలు.. అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి లాంటి సమస్యలను నివారిస్తాయి.

జామపండులో ఉండే విటమిన్ C.. కంటిచూపుని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది.

జామపండు శరీరంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గించటంలో సహాయపడుతుంది.

జామపండు మహిళలకు పీరియడ్స్‌లో ఉపశమనం ఇవ్వడంలో దోహదపడుతుంది.

జామపండు పంటి నొప్పిని, నోటి అల్సర్‌లను తగ్గించడంలో శక్తివంతంగా పని చేస్తుంది.

జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు.