గ్రీన్ బొప్పాయితో ఆరోగ్యానికి మేలంటున్న నిపుణులు..
ఇందులోని లైకోపీన్, బీటా-కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇది శరీరంలోని హానికరమైన మూలకాలను తొలగిస్తాయి.
కణాలను దెబ్బతీయకుండా కాపాడతాయి.
పురుషులలో ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం కూడా ఈ విషయాన్ని ఓ అధ్యయనంలో స్పష్టం చేసింది.
కామెర్లను నివారించడంలో పచ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది.
గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల మలేరియా, డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది.