పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చిమిర్చి శరీర జీవక్రియను పెంచుతుంది. ఈ ప్రక్రియలో ఆహారాలు అవసరమైన శక్తిగా మారుతాయి. దీంతో కేలరీలు కరిగి, శరీర బరువు తగ్గుతుంది

పచ్చిమిర్చిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది సరైన గుండె పనితీరును నిర్వహిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది

పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ ఉంటుంది. జలుబు, ఫ్లూ వల్ల కలిగే అంటువ్యాధులను తొలగించి.. ఆరోగ్యంగా ఉంచుతుంది

పచ్చిమిర్చిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, రోగాలు దరిచేరకుండా కాపాడుతాయి.

డయాబెటిస్ ఉన్నవారు పచ్చిమిర్చిని ఆహారంలో చేర్చుకుంటే, రక్తంలో సమతుల్య చక్కెర స్థాయిని కొనసాగించవచ్చు

పచ్చిమిర్చిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే క్యాస్పేసియన్ అనే ఓ పదార్థం ఉంది, శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది

పచ్చిమిర్చి జీర్ణశక్తిని పెంచి, అజీర్తిని తొలగిస్తుంది, పక్షవాతాన్ని తగ్గిస్తుంది, రక్తస్రావాన్ని అరికడుతుంది

మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాసుకుంటే.. కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి