నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వైరస్, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతాయి
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ అనే ఒక కొవ్వు ఆమ్లం ఉంటుంది, అది జీర్ణ శక్తిని పెంచడంతో పాటు మలబద్ధక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది
నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. అంతేకాదు.. కణాలు, కణజాలాలు దెబ్బతినకుండా రక్షణ కలిగిస్తాయి
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా నెయ్యి కాపాడుతుంది
నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి
ఎముకలు, పళ్ళను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడే విటమిన్ కే.. నెయ్యిలో పుష్కలంగా ఉంటుంది
నెయ్యిలో ఏ, డీ, ఈ, కే విటమిన్స్ ఉంటాయి. కాబట్టి భోజనంలో కొంత నెయ్యిని జోడిస్తే.. అవసరమయ్యే విటమిన్లు శరీరానికి అందుతాయి
నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఏ.. స్కాల్ప్ మీద ప్రభావాన్ని చూపి చుండ్రు, దురద, పొడి జుట్టును నివారించడంలో సహాయపడతాయి
నెయ్యిలో విటమిన్ ఏ వంటి మంచి అనామ్లజనకాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది
గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు క్యాన్సర్‌తో పోరాడే పోషకాలూ నెయ్యిలో పుష్కలంగా ఉంటాయని అధ్యయనంలో తేలింది