శరీరానికి పోషకాలన్నీ అందాలి.. బరువు మాత్రం పెరగొద్దంటే గుడ్డును ఎంచుకోమంటున్నారు నిపుణులు.

 పవర్‌ప్యాక్డ్‌ ఫుడ్‌గా చెప్పే గుడ్డు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. 

బరువు తగ్గాలి అనుకుంటే రోజూ ఆహారంలో రెండు గుడ్లను చేర్చుకోండి. 

ప్రొటీన్లు, ఆరోగ్య కరమైన కొవ్వులు గుడ్డులో పుష్కలం. 

గుడ్డులోని మంచికొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు, ట్రైగ్లిజరాయిడ్లకు వ్యతిరేకంగా పోరాడి, గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి.

 చర్మం ఆరోగ్యంగా, నిగ నిగలాడుతూ కనిపించడంలో సెలీనియంది ప్రధాన పాత్ర. ఇది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది.

గుడ్డులోని లూటిన్‌, జెనాక్సాంథిన్‌.. కణాలు పాడవకుండా కాపాడి, వృద్ధాప్య ఛాయల్ని దరిచేరన్వివు.

తరచూ జబ్బు పడుతున్నట్లు అనిపిస్తే గుడ్డును రోజూ తీసుకోండి. దీన్లోని విటమిన్లు, మినరల్స్‌ ఆరోగ్యంగా ఉంచుతాయి.

రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల మతిమరుపు రాకుండా ఉంటుంది

గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటిని రోజూ తీసుకుంటే పిల్లల మెదడు అభివృద్ధికి సాయపడుతుంది.

 ఓ అధ్యయనం ప్రకారం తరచూ గుడ్డు తీసుకునే వారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 44% తగ్గుతాయట.