యాంటీఆక్సిడెంట్స్ వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
కాల్షియం, బోరాన్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.
కిస్మిస్‌లో ఐరన్, కాపర్, విటమిన్ B కాంప్లెక్స్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
కిస్మిస్‌లో ఉండే ఫీనాలిక్ కాంపౌండ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
కిస్మిస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రుక్టోజ్) ఉండటం వల్ల శక్తిని ఇస్తుంది, మానసిక ఏకాగ్రత పెరుగుతుంది.
రాత్రి ఒక గ్లాస్ నీటిలో 8–10 కిస్మిస్ నానబెట్టి, ఉదయం నీటిని తాగి కిస్మిస్ తింటే శరీరానికి అధిక ప్రయోజనం కలుగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదు.