డ్రైఫ్రూట్స్‌‌లో పోషకాలతోపాటు శరీరానికి ఆవశ్యకమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి

రోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే.. శరీరంలో జీవక్రియలు వేగం పుంజుకుంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు

వీటిలోని పొటాషియం, ఐరన్‌, ఫోలేట్‌, క్యాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు.. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

బాదాం, ఖర్జూర వంటి డ్రైఫ్రూట్స్‌‌లో.. కేశాల పెరుగుదలకు తోడ్పడుతాయి. మన వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచేలా చేస్తాయి

డ్రైఫ్రూట్స్‌‌లోని యాంటీ ఆక్సిడెంట్లు.. కేన్సర్‌‌కు కారణమయ్యే పదార్థాలను, ఫ్రీ ర్యాడికల్స్‌‌ను తొలగిస్తాయి

ఇందులోని అంథోసైనిన్‌ వంటి ఫైటోకెమికల్స్‌.. మెదడు పనితీరును మెరుగుపర్చి, మెదడుకు రక్తం సరిగా సరఫరా అయ్యేలా చూస్తాయి

డ్రైఫ్రూట్స్‌‌లో ఫైబర్‌ గణనీయంగా ఉంటుంది. వీటిని ఉదయాన్నే తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది

డ్రైఫ్రూట్స్‌లో ఐరన్‌ శాతం ఎక్కువ. కాబట్టి వీటిని రోజూ తీసుకుంటే.. రక్తహీనత, ఎనీమియా వంటి సమస్యలు దూరమవుతాయి

వృద్ధాప్యంతో వచ్చే సమస్యలను దూరంగా ఉంచడంలో.. ఈ డ్రైఫ్రూట్స్ ఎంతో సహాయపడుతాయని నిపుణులు చెప్తున్నారు