ప్రస్తుతం దాదాపు రిఫ్రిజిరేటర్​లను వాడుతున్నారు. కానీ అప్పట్లో ప్రతి ఇంట్లో మట్టి కుండలే దర్శనం ఇచ్చేవి. 

ఆ మట్టి కుండలోని నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసుకుందాం..  

మట్టి కుండలు కేవలం నీటిని చల్లబరచడానికే కాదు, నీటిని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. 

  వేరే బాటిళ్లలో నీరు ఉష్ణోగ్రతకు తొందరగా వేడెక్కుతాయి. వీటికి బదులు మట్టి సీసాల్లో నీళ్లను తీసుకెళ్లడం ఎంతో ఉత్తమం.

మట్టిలో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్​ల శక్తి ఉంటుంది. ఆ నీటిని తాగడం వల్ల వేసవి ఎండకి కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.

 వేసవిలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలకు మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీళ్లు సాయపడతాయి. ఎసిడిటీ తగ్గుతుంది.  

 నీళ్లనే కాకుండా మజ్జిగ, లస్సీని కూడా మట్టి పాత్రల్లో నిల్వ ఉంచొచ్చు. 

మట్టి పాత్రలోని ఖనిజాల కారణంగా అవి మరింత రుచిగా మారుతాయి.

 మట్టి కుండలోని నీటిలో సహజసిద్ధమైన ఆల్కలీన్​లు ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి.

పీహెచ్​ విలువను స్థిరంగా ఉంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.