గాడిద పాలు మనలో చాలామంది తాగి ఉండరు. కానీ ఒక్కసారి గాడిద పాలతో దొరికే లాభాలు తెలిస్తే వెంటనే తాగడం ప్రారంభిస్తారేమో.

 గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.

 గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అందుకే ఈ పాలల్లో ఉండే ఔషధ గుణాలు తల్లి పాలలో ఉండే ఔషధ గుణాలకు చాలా దగ్గరగా ఉంటాయట.

గాడిద పాలలో లాక్టోస్ పుష్కలంగా ఉంటుంది.  వేసవిలో గాడిద పాలు తాగడం చాలా మంచిది. అథ్లెట్లకు లేక శారీరక శ్రమ చేసేవారికి చాలా మేలు చేస్తాయి.

   విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి, డి, అలాగే ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించే విటమిన్-ఇ కూడా గాడిద పాలలో సమృద్ధిగా లభిస్తుంది.

 ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మపు చికాకును తగ్గించడం, చర్మ ముడతలు తగ్గించడం లాంటి వాటికి సహాయపడతాయి.

గాడిద పాలు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటుంది. ఈ పాలు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయి.

గాడిద పాలను ఫార్మాస్యూటికల్స్, సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పురాతన కాలంలో రుమాటిజం, దగ్గు, గాయాలకు చికిత్సగా వాడేవారు. 

గాడిద పాలలో యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆఫ్రికాతో పాటు భారత్‌లో గాడిద పాలను దగ్గుకు, ఇతర వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.

 ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఒంటెలు వంటి ఇతర జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాల వల్లే అధిక లాభాలు ఉన్నాయని తెలుస్తోంది.