మొక్కజొన్నతో  ఈ సమస్యలకి చెక్

మొక్కజొన్నలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి

మొక్కజొన్నలో ఫోలిక్‌ యాసిడ్‌.. రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల వృద్ధి చేస్తుంది

మొక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. పలితంగా.. మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు దరిచేరవు

మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంతో పాటు శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి

మొక్కజొన్నలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది

కంటి ఆరోగ్యానికి మెరుగుపరిచే కెరోటినాయిడ్లు, ల్యూటిన్, జియాక్సాంతిన్ వంటివి మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి

శరీరంలోని వాపు, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించే యాంటీ ఆక్సిడెంట్లు మొక్కజొన్నల్లో సమృద్ధిగా ఉన్నాయి

మొక్కజొన్నలో ఉండే ఫ్లేవనాయిడ్లు.. రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి, కొలెస్టిరాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి

మొక్కజొన్నలో ఉండే విటమిన్-సి, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్.. జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.