కొబ్బరినీటిలో 94 శాతం నీరు.. విటమిన్ బి, అమైనో యాసిడ్లు, ఎంజైమ్స్ ఉంటాయి.
శరీరానికి కావాల్సిన లవణాలను అందిస్తుంది. పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఉంటాయి. శరీరాన్ని డీహైడ్రేట్ కానివ్వదు.
వ్యాయామం చేసేవారికి కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తుంది.
షుగర్‌ని తగ్గిస్తుంది. దీంట్లో ఉండే మెగ్నీషియం టైప్-2 డయాబెటిస్‌ని తగ్గిస్తుంది.
ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో టిష్యూల ఆరోగ్యానికి సహకరిస్తాయి.
అమైనో యాసిడ్స్ ఒత్తడిని తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
కొబ్బరి నీటిలో సైటోకైనిన్లు ఉంటాయి. యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని హానికరమైన కొవ్వులను తగ్గిస్తుంది. మంచి కొవ్వులను పెంచుతుంది.