కొబ్బరి నీళ్లతో ఎన్నో
ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం.. టైప్ 2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి మేలుచేస్తుంది. షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది.
కొబ్బరి నీళ్లలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. కొలాజెన్ సింథెసిస్‌ని ఉత్తేజపరుస్తాయి. దీంతో చర్మం బిగుతుగా మారి, యవ్వన రూపం సంతరించుకుంటుంది.
భోజనానికి ముందు ఆ గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే, ఇందులోని లారిక్ యాసిడ్ కారణంగా ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది, దాంతో బరువు తగ్గుతారు.
కొబ్బరి నీళ్లని ఎక్కువగా తాగితే, ఇది డిటాక్స్‌లా పని చేసి, విషతుల్యాలను మలమూత్రాల ద్వారా బయటకు పంపుతుంది.
కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగితే, మూత్రపిండాల్లో ఉండే రాళ్లు త్వరగా కరిగిపోతాయి. మంచి నీళ్ల కంటే కొబ్బరి నీళ్లే బాగా పని చేస్తాయి.
కొబ్బరి నీళ్లు మతిమరుపు సమస్యని పరిష్కరించగలదు. ఎందుకంటే, ఇందులో జ్ఞాపకశక్తిని పెంచే ట్రాన్స్-జేజిటిన్ పుష్కలంగా ఉంటుంది.
కొబ్బరి నీళ్లు తరచూ తీసుకుంటే, ఒంట్లో అధికంగా ఉండే సోడియం మూత్రం ద్వారా బయటకు పోతుంది. దీంతో రక్తపోటు దరిచేరదు.
కొబ్బరి నీళ్లలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి కండరాల తిమ్మిరిని దూరం చేయడంతో పాటు ఎముకల్ని బలంగా ఉంచుతాయి.