దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది

దాల్చిన చెక్క కషాయం తాగితే, వాంతులు వెంటనే తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు

దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి, నుదురుకు పట్టులాగా వేస్తే, తలనొప్పి వెంటనే తగ్గుతుంది

ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు తీసుకుంటే.. కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది

దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే, అది కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు

దాల్చిన చెక్క నూనె చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుంది

చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునేముందు సేవిస్తే, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది

దాల్చిన చెక్కలో ఫ్లావనాయిడ్స్, ఇతర యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. అవి నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులను తగ్గిస్తాయి

దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు.. దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను, నోటి పుండ్లను నివారిస్తాయి

దాల్చిన చెక్క టీ క్రమం తప్పకుండా తీసుకుంటే.. షుగర్, కాన్సర్, గుండె జబ్బులు, చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలు దూరమవుతాయి