గోధుమ పిండితో తయారుచేసే రోటీల వల్ల శరీరానికి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 

చపాతీలో జింక్, ఫైబర్, ఇతర మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మానికి చాలామేలు చేస్తుంది.

చపాతీ చాలా సులభంగా జీర్ణం అవుతుంది . కాబట్టి, అన్నంకు బదులుగా రోటీలను తినడం ఉత్తమం . 

 చపాతీల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. దాని వల్ల మన శరీరానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది. 

చపాతీల్లో ఐరన్ అధికంగా ఉంటుంది . రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్స్‌ను పెంచుతుంది.

చపాతీలకు నూనె లేదా బటర్ జోడించకుండా తీసుకుంటే చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది,. కాబట్టి ఇది వెయిట్ లాస్ డైట్‌కు సహాయపడుతుంది.

మలబద్ధకాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది. 

రోటీల్లో ఉండే ఫైబర్, సెలీనియం కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.