చామంతి టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి

చామంతి పూల టీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, దీంతో అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు

చామంతి టీలో ఉండే ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్.. నిద్రను ప్రేరేపిస్తుంది. ఆందోళనే కలిగించే లక్షణాల్ని తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది

చామంతి టీలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు.. రుతుస్రావం సమయంలో మహిళల్లో కలిగే నొప్పి తగ్గించడానికి సహాయపడతాయి

చామంతి టీ చుండ్రు, దురద సమస్యలకు చెక్ పెడుతుంది. హెన్న ఫేస్ మాస్కులో చామంతి టీ కలిపి, తలకు అప్లై చేసి, షాంపూతో తలస్నానం చేయాలి

వేడి వేడిగా చామంతి టీ తాగినా, దాని ఆవిరిని పీల్చినా.. జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది

ముక్కు కారటం, గొంతు నొప్పిని తగ్గించడంలో చామంతి టీ అద్భుతంగా దోహదపడుతుంది

చామంతి టీ గుండెకు మేలు చేస్తుంది. కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది

భోజనం చేసే ముందు చామంతి టీ తాగితే.. జీర్ణ ప్రక్రియ మెరుగుపడి, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది

చామంతి టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే డామేజ్ నుంచి రక్షిస్తాయి. మొటిమల్ని తగ్గిస్తాయి