బ్రోకలీలోని సల్ఫోరాఫేన్ అనే రసాయనం.. రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవచ్చు. కాబట్టి.. డయాబెటిస్ ఉన్న వాళ్లు తింటే మంచిది.
బ్రోకలీలో ఉండే విటమిన్ సీ.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా.. శరీరంపై దాడి చేసే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరం బలంగా తయారవుతుంది.
బ్రోకలీలో ఉండే ఫైబర్, పొటాషియం బరువు తగ్గడానికి సహాయపడతాయి. చలికాలంలో బ్రోకలీ సూప్ తాగితే.. శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుంది.
బ్రోకలీని ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకుంటే, కాలేయాన్ని ఆరోగ్యం ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంది.
బ్రోకలీలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బ్రోకలీలో ఉండే క్వెరెసిటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, గుండె సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.
బ్రోకలీలో ఉండే ఫైబర్, సల్ఫోరాఫేన్.. జీర్ణక్రియ రేటును పెంచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది.
బ్రొకోలీలో ఉన్న గ్లూకోరఫినైన్ అనే రసాయం.. డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేయడంతో పాటు హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్‌ను పొందేలా చేస్తుంది.