బ్లాక్ టీలో కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో కేలరీలు తగ్గుతాయి. జీర్ణక్రియను వేగవంతం చేసే గుణం ఇందులో ఉంటుంది

బ్లాక్ టీలో కేంప్‌ఫెరాల్‌, ఇతర పవర్ఫుల్ యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఉదరం, పెద్దపేగు, ఉపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి

బ్లాక్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించగలదు. డయేరియా వ్యాధి గ్రస్తులు ఇది తాగితే మంచిది

గుండె జబ్బులతో బాధపడుతున్న వారు రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగటం మంచిది. దీంతో వారిలో కరోనరీ ఆర్టేరీ డిస్-ఫంక్షన్స్ తగ్గిపోతాయి

బ్లాక్ టీలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడడానికి దోహదం చేస్తాయి

బ్లాక్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. ఇది మెదడుకు సాఫీగా రక్తసరఫరా అయ్యేలా చేస్తుంది. నాడీ కణాల వ్యవస్థ సక్రమంగా పని చేసేలా ఉపయోగపడుతుంది

బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సైడ్స్.. ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. వివిధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి

బ్లాక్ టీ బాడీనీ హైడ్రెటెడ్ గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది

బ్లాక్ టీలో ఉండే ఎమైనో యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్లాక్ టీ నిత్యం తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ప‌ని చేస్తారు

బ్లాక్ టీలో ఉండే కేట్చిన్ నోటి క్యాన్సర్ తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే టానిన్, పాలిఫేనోల్స్ దంతాలను పరిరక్షిస్తాయి