తమలపాకులో ఉండే యూజెనాల్ కాలేయంలో కొవ్వుశాతం పెరగకుండా అడ్డుకుంటుంది.
ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని నియంత్రించడంలోనూ సహాయపడి.. గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
వీటిలోని ఫెనోలిక్ ఆమ్లాలు పుష్కలంగా ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి.
తమలపాకుల్లో యాంటీహిస్టామైన్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
ఆస్తమా, కాలనుగుణ అలర్జీలతో బాధపడేవాళ్లు తరచూ ఈ రసాన్ని తాగడం లేదా ఆకుల్ని నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తమలపాకుల్లో ఉండే పాలీఫెనాల్స్, చవికోల్ క్రిమినాశకాలుగా పనిచేస్తాయి. జీర్ణసంబంధిత సమస్యలు, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
అలాగే ఈ తమలపాకులు వేసుకోవడం వల్ల నోటి పరిశుభ్రత బాగుంటుంది.
తమలపాకుల్లో సి విటమిన్ ఉంటుంది. జుట్టురాలడం, చుండ్రు సమస్యలతో బాధపడేవారు మందార ఆకుల్ని, వీటిని పేస్టులా చేసి జుట్టుకి మాస్క్‌లా వేసుకుంటే మేలు.