బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు.. రక్త నాళాల్లో రక్త ప్రవాహాన్ని సులభతరం చేసి, రక్తపోటు నుండి ఉపశమనం కలిగిస్తాయి

బీట్‌రూట్‌లో ఉండే బీటా సానిన్, యాంటీఆక్సిడెంట్.. క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి

బీట్‌రూట్ జ్యూస్ క్రమం తప్పకుండా భోజనం చేశాక తాగితే, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది

మెదడుకు రక్త ప్రవాహం సులభం చేయడంతో పాటు ఇతర సమస్యల నుంచి కాపాడుతుంది

బీట్‌రూట్ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకుంటే, కాలేయ సామర్థ్యం మెరుగుపడుతుంది

బీట్‌రూట్‌ను హెయిర్ డైగా కూడా ఉపయోగించుకోవచ్చు, ఫలితంగా హానికరమైన కృత్రిమ రంగుల నుండి ఇది కాపాడుతుంది

రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు

బీట్‌రూట్ నిత్యం తినేవారిలో శారీరక దారుఢ్యం పెరుగుతుందని ‘న్యూట్రియన్ట్స్ - ఓపెన్ ఎక్సెస్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రీషన్’ వెల్లడించింది