ఆప్రికాట్‌లో అధిక ఫైబర్‌తో పాటు లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి

ఆప్రికాట్‌లో విటమిన్-ఏ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది, క్రమంగా దృష్టిని మెరుగుపరుస్తుంది

ఆప్రికాట్‌లో ఉండే ఫైబర్ కంటెంట్.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతూ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది

ఎముకల ఆరోగ్యానికి, పెరుగులకు అవసరమయ్యే కాల్షియం, ఇనుము, రాగి, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటివి ఆప్రికాట్‌లో పుష్కలంగా ఉంటాయి

ఆప్రికాట్‌లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల్ని ఉత్పత్తి చేసి, అనీమియా (రక్త హీనత) నుంచి కాపాడుతుంది

ఆప్రికాట్‌లో ఏ, సీ విటమిన్స్‌తో పాటు ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతాయి

ఆప్రికాట్‌లో పొటాషియం, సోడియం వంటి ఖనిజాలుంటాయి. ఇవి అవయవాలకు, కండరాల వంటి వివిధ భాగాలకు శక్తిని పంపిణీ చేస్తాయి

క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడే కెరోటినాయిడ్స్చ ఇతర యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆప్రికాట్‌లో పుష్కలంగా ఉంటాయి

ఆప్రికాట్ తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. ఇది క్రమంగా శరీర బరువును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది