ఆపిల్ తొక్కలో ఏ, సీ, కే విటమిన్స్‌తో పాటు పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి మినరల్స్‌ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి

యాపిల్ తొక్కలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఫలితంగా, బరువు తగ్గుతారు

ఆపిల్ తొక్కలో ఉండే పాలీఫెనాల్స్.. గ్లూకోజ్, కొవ్వు శోషణను నిరోధిస్తుందని అధ్యయనాల్లో తేలింది

ఆపిల్ తొక్కలోని పాలీఫెనాల్స్.. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన గుండె కోసం వాస్కులర్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది

యాపిల్ తొక్కలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్‌‌ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను, గుండెను అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది

ఆపిల్ తొక్క లివర్ ఆరోగ్యంగా ఉండటంలో, ఎముకల్ని బలంగా తయారు చేయడంలో సహాయపడుతుంది

ఆపిల్‌ తొక్కలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు డయాబెటిస్‌ పేషెంట్స్‌కు ఎంతో మేలు చేస్తాయి

ఆపిల్ పండును తొక్కతో తింటే.. కడుపు, కాలేయం, రొమ్ము క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే నాళాలు తొలగిపోతాయని తేలింది