రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉంటుంది. కాబట్టి షుగర్‌ పేషెంట్లు బాదం తింటే మంచిది

బాదంలో విటమిన్‌ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బాదంలో మెగ్నీషియమ్‌ ఉంటుంది. ఇది రక్తపోటు నివారణకు బాగా ఉపయోగపడుతుంది

బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి

బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. ఊబకాయులు బరువు పెరగకుండా నియంత్రించుకోడానికి ఇది అనువైనది

మెదడు పనితీరుని మెరుగుపరిచి, జ్ఞాపశక్తిని పెంచుతుంది. అల్జీమర్స్ వ్యాధి నుంచి కాపాడుతుంది

బాదం రోజూ తింటే.. రొమ్ము, ప్రొస్టేట్, పురీష, పెద్ద ప్రేగు క్యాన్సర్ దరి చేరకుండా రక్షిస్తుంది

ఎముకల ద్రవ్యరాశి, సాంధ్రతను మెరుగుపరచడంలో బాదం సహాయపడుతుంది

జుట్టును ఒత్తుగా, దృఢంగా పెంచే మెగ్నీషియం, జింక్, విటమిన్ E వంటివి బాదంలో ఉంటాయి

బాదంలో మాంగనీస్, కొల్లాజెన్ అనే పదార్థాలు.. చర్మాన్ని కోమలంగా, ముడతలు లేకుండా చేస్తుంది