చాలా మంది ఏదైనా అరోగ్య సమస్యకు గురవగానే బలం కోసం బాదం, పిస్తా తింటుంటారు. కానీ బాదం పేదలకు అందని ద్రాక్షలా తయారైంది. కానీ బాదంలో కంటే ఎక్కువగా శనగల్లో పోషకాలు లభిస్తాయట.

 నాన్‌వెజ్‌తో సమానమైన పోషకాలు శనగల్లో ఉంటాయని చెప్తుంటారు పోషకాహార నిపుణులు.

ఫాబేసి కుటుంబానికి చెందిన శనగ పప్పులో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. శనగల్లో నాటీ శనగలు, కాబూలీ శనగలు కూడా ఉంటాయి. 

కొన్ని శనగలు నానబెట్టి మొలకలు వచ్చాక పచ్చివి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరం. శనగల చాట్ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. 

 శనగల్లో కాల్షియం, విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే, ఫాలేట్‌, మెగ్నిషియం, ఫాస్పరస్, సెలీనియం, ఫైబర్‌, ఐరన్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. 

శనగలు తింటే ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారం.

 శనగల‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఐరన్, ప్రొటీన్, మినరల్స్ శరీరానికి ఎనర్జీని అందించి అలసట, నీరసం, నిస్సత్తువ వంటి వాటిని తగ్గిస్తాయి

 శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండి వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

 శనగలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి.  గుండె సంబంధ స‌మ‌స్యలు రాకుండా చేస్తాయి. 

మధుమేహులు రోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

 శనగల్లో ఉండే అమైనో యాసిడ్స్ రక్తకణాల ఎదుగుదల, ప్రసారానికి దోహదపడతాయి.