బిర్యానీ తినేటప్పుడు కొంతమంది సాధారణంగా కూల్ డ్రింకులు తాగుతుంటారు. ఇది కొన్ని సందర్భాల్లో రుచికరంగా అనిపించినప్పటికీ, దీని ప్రభావాలు ఆరోగ్యపరంగా ఆలోచించాల్సినవే. 

బిర్యానీ అంటే వేడి, మసాలా, చక్కని పోషకాలతో కూడిన భోజనం. కూల్ డ్రింకులు.. ఎక్కువగా చక్కెరలు, కార్బోనేషన్, సింథటిక్ రసాయనాలతో తయారవుతాయి. ఈ కలయిక శరీరంపై కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు. 

బిర్యానీ సహజంగా బరువైన ఆహారం, దీన్ని జీర్ణం చేయడానికి కొంత సమయం పడుతుంది. కూల్ డ్రింకులోని కార్బనేషన్ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ లు ఏర్పడటానికి కారణమవుతుంది. 

ఫిజి పానీయాలు పేగుల్లో గ్యాస్ ఏర్పరచి, అజీర్ణం, పొట్ట నొప్పి, మరియు ఉబ్బరం (బ్లోటింగ్) వంటి సమస్యలను పెంచుతాయి. కూల్ డ్రింకుల్లో ఉన్న అధిక స్థాయిలో చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. 

బిర్యానీలో ఇప్పటికే ఉన్న కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఈ ప్రభావాన్ని మరింత పెంచి, శరీరంలో చక్కెర స్థాయిలు అనవసరంగా ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా మధుమేహ రోగులు లేదా చక్కెర నియంత్రణ సమస్యలతో బాధపడుతున్న వారికి హానికరం.

కూల్ డ్రింకుల్లోని అధిక చక్కెరలు మరియు ప్రిజర్వేటివ్లు కాలేయంపై మరియు కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతాయి. బిర్యానీలో ఉన్న ప్రోటీన్లు, కొవ్వులు ఇప్పటికే శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. 

కూల్ డ్రింకులతో పాటు తీసుకోవడం వలన శరీరంలో టాక్సిన్ లు ఎక్కువ అవుతాయి, ఇది కాలేయం మరియు కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది. 

బిర్యానీ సహజంగానే హై కాలరీ ఆహారం, దీని కారణంగా ఒబేసిటీ, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని తరచూ తీసుకోవడం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటానికి దారితీస్తుంది.

కూల్ డ్రింకులు ఎక్కువగా తాగడం వలన మధుమేహ మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్షణమే పెరిగి, తరువాత త్వరగా తగ్గిపోతాయి. ఇది శరీరంలో ఉత్సాహాన్ని తగ్గిస్తుంది, చలాకీగా ఉండే శక్తిని కోల్పోవటానికి కారణం అవుతుంది. 

బిర్యానీ లాంటి రుచికరమైన ఆహారం తిన్నప్పుడు తక్షణమే కూల్ డ్రింకులు తాగడం వలన, ఈ ఫలితాలు స్పష్టంగా కనపడతాయి. 

బిర్యానీ తింటూ నీరు తాగడం మంచిది కాదని వైద్య నిఫుణులు చెబుతున్నారు. కూల్ గా ఉంటాయి, బిర్యానీ తినేప్పుడు స్టైల్ కోసమో తాగి అనారోగ్యం కొని తెచ్చుకోకండి అని సూచిస్తున్నారు.