సంతోషకరమైన క్షణాలను జరుపుకునే సమయంలో ఒక్క భారతదేశమనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మద్యాన్ని తీసుకుంటారు. కొందరైతే ప్రతిరోజు క్రమం తపపకుండా తీసుకుంటారు.

మందు కొట్టడాన్ని కంపెనీ అని చెబుతూ ఇష్టమైన క్షణాన్ని ఎంచుకుంటారు. ఆల్కహాల్ కు సంబంధించి మనదగ్గర విస్కీ, బ్రాందీ, రమ్, వైన్, జిన్, బీర్.. ఇలా విభిన్న రుచుల్లో దొరుకుతాయి. 

ప్రతి ఒక్కరూ తమ అభిరుచులను బట్టి ఇష్టమైనవాటిని తీసుకుంటుంటారు. అతి కొద్దిమంది మాత్రమే వీటిని తీసుకునేముందు కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుంటారు. 

వైన్, రమ్, విస్కీ బీర్‌లలో ఏది అత్యంత హానికరమో తెలుసుకుందాం. మద్యం సేవించని చాలా మందికి కూడా దాని గురించి ఏమీ తెలియదు. 

వైన్ ఒక రకమైన పులియబెట్టిన ద్రాక్ష రసం. నలుపు, ఎరుపు ద్రాక్ష నుండి తయారు చేస్తారు. రెండు వారాలపాటు ఓక్ బారెల్స్ లో పిండిచేసిన ద్రాక్షను పులియబెట్టడంద్వారా రెడ్ వైన్ తయారవుతుంది. 

తర్వాత ఓక్ బారెల్స్ లో పరిపక్వం చెందుతుంది. రెడ్ వైన్ లో 14 శాతం ఆల్కహాల్ ఉంటుంది.  విస్కీలో 30% నుండి 65% వరకు అధిక ఆల్కహాల్ ఉంటుంది. 

విభిన్నమైన ఆల్కహాల్ కంటెంట్ తో ఇది అందుబాటులో ఉంటుంది. గోధుమ, బార్లీని ప్రత్యేక పద్ధతిలో పులియబెట్టి చేస్తారు. కిణ్వ ప్రక్రియ తర్వాత వోట్ పీపాల్లో కొంతకాలం ఉంచుతారు. 

బీరు చాలా తక్కువ ప్రమాదం. పండ్లు, ధాన్యం రసాలను వాడతారు. తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. నాలుగు శాతం నుంచి ఎనిమిది శాతం లోపు ఉంటుంది. 

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలామంది రమ్ ను ఇష్టపడతారు. పులియబెట్టిన చెరకు, మొదలైనవాటితో తయారుచేస్తారు. ఇందులో కూడా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. 

ఆల్కహాల్ కంటెంట్ 60 నుంచి 70 శాతంగా ఉంటుంది. అయితే ఆల్కహాల్ శాతం తక్కువగా ఉందికదా అని బీరు, వైన్ లాంటివి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. 

ఈ వార్త కేవలం వాటిల్లో ఉండే ఆల్కహాల్ శాతం గురించి రీడర్లు తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది.