గ్యాస్ట్రిక్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మానసికం, శారీరకంగా ఇబ్బంది పెడుతుంది. 

చాలా రోజులుగా గ్యాస్ట్రిక్ సమస్యలో బాధపడుతుంటే అది "హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్"గా అనుమానించాల్సి ఉంటుంది.

హెచ్ పైలోరీ ఓ బ్యాక్టీరియా, ఇది జీర్ణాశయంలో చాలా కాలంగా ఉంటూ గ్యాస్ట్రిక్, అల్సర్లకు కారణం అవుతుంది. 

జీర్ణాశయం లోపలి గోడలను ప్రభావితం చేస్తూ, జీర్ణాశయ రసాలు ఎక్కువగా విడులయ్యేందుకు కారణం అవుతుంది. 

దీన్ని ఇలాగే వదిలేస్తే అల్సర్లు క్యాన్సర్లుగా మారే అవకాశం ఉంటుంది. 

దీన్ని ఎండోస్కోపి, హెచ్ పైలోరీ టెస్టు ద్వారా నిర్థారిస్తారు.

డాక్టర్లు డబుల్ యాంటీ బయాటిక్, యాసిడిటీని తగ్గించే మాత్రలతో బ్యాక్టీరియా శరీరం నుంచి వెల్లేలా చేస్తుంటారు. 

యాంటీ బయాటిక్స్ వల్ల శరీరం నుంచి బ్యాక్టీరియా వెళ్లిపోతుంది. క్రమంగా గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి.