బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్‌తో జగతి అనే పాత్రలో జ్యోతి రాయ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

గుప్పెడంత మనసు సీరియల్ లో జ్యోతిరాయ్ ను చూసిన ప్రేక్షకులు ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవడం మొదలుపెట్టారు.

 ఒకరకంగా జ్యోతిరాయ్ షేర్ చేసే ఫొటోలు చూసి కళ్లు తిరిగి పడిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. 

చీర కట్టుకొని సీరియల్ లో ఎంతో ఒద్దికగా, పద్దతైన పాత్రలో నటించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తుంటారు. 

జోగుల సీరియల్‌తో కన్నడిగులకు వెంటనే గుర్తొస్తుంది. జీ కన్నడలో ప్రసారమైన ఈ సీరియల్‌లో దేవకి పాత్రలో నటించిన ఆమెను అభిమానులు మరచిపోలేరు. 

జగతి ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో, ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. 

ఏ మాస్టర్ పీస్ చేస్తున్న సమయంలోనే ఈ సిరీస్ దర్శకుడు సురేష్ కుమార్ తో ప్రేమలో పడింది. తన ఇన్ స్టా హ్యాండిల్ పేరు కూడా మార్చేసుకుంది.  

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రంలో ఓ పాత్ర దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  

అయితే సోషల్ మీడియాలో ఫొటోలను చూసిన కుర్రకారు టాలీవుడ్ హీరోయినా? లేదంటే బాలీవుడ్ హీరోయినా? ఎవరు? అంటూ కామెంట్లు పెడుతున్నారు.