టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గూగుల్‌ పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ ఫోన్ రిలీజ్ అయింది.

ఆగస్టు 22 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ రిటేల్‌ ఔట్‌లెట్లలో కొనుగోలు చేయవచ్చు.

బుక్‌ స్టైల్‌లో ఉన్న ఫోల్డబుల్‌ ఫోన్‌లో టెన్సార్‌ జీ4 చిప్‌సెట్‌ను అమర్చారు.

 6.3 ఇంచెస్ పొడవుతో 120హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ కలిగి ఉంది. ఫోల్డ్‌ తెరిచాక 8 అంగుళాలతో కూడిన ఫ్లెక్స్‌ అమోలోడ్‌ డిస్‌ప్లే ఉంటుంది.

వెనక వైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 10.5 ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 10.8 ఎంపీ టెలీఫొటో కెమెరా ఉంటుంది.

ఇందులో 4,560 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 45 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఒబ్సిడియాన్‌, పోర్సెలేన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

16జీబీ+256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.1,72,999గా ఉంది.