మలయాళ చిత్రసీమలో తొలి మహిళా నటి అయిన పీకే రోసీ 120వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఆమెకు డూడుల్‌ను అంకితం చేసింది.
పీకే రోసీ ఫిబ్రవరి 10, 1903న కేరళలోని తిరువనంతపురంలో జన్మించినట్లు గూగుల్‌లో ఆమెకు అంకితమైన పేజీలో పేర్కొనబడింది.
పీకే రోసీ అసలు పేరు రాజమ్మ. ఆమెకు నటన పట్ల చిన్నవయసులోనే ఇష్టం మొదలైంది.
ముఖ్యంగా మహిళలకు సాంస్కృతిక కళలలో పెద్దగా ప్రవేశం లేని రోజుల్లోనే మలయాళ చిత్రం విగతకుమారన్ (ది లాస్ట్ చైల్డ్)లో ఆమె తన నటనతో అడ్డంకులను అధిగమించింది.
ఆ సినిమాలో నటించిన కారణంగా రోజీ జీవితాంతం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. అందుకే గూగుల్‌లో ఆమెకు సంబందించిన ఒక అస్పష్టమైన చిత్రం మాత్రమే ఉంది.
విగతకుమారన్ చిత్రంలో రోసీ సరోజిని అనే నాయర్(పెద్ద కులం) మహిళగా నటించింది.
ఆమె ట్రక్ డ్రైవర్ అయిన కేశవ పిళ్లైని వివాహం చేసుకుని తమిళనాడుకు వెళ్లి అక్కడ 'రాజమ్మాళ్' అనే పేరును ఉపయోగించుకున్నట్లు సమాచారం.
పీకే రోసీ మలయాళ సినిమా మొదటి నటి, భారతీయ సినిమాల్లోనే మొదటి దళిత నటి.
ఆమెకు గుర్తుగా మలయాళ సినిమా మహిళా నటీమణుల సంఘానికి పీకే రోసీ ఫిల్మ్ సొసైటీ అని పేరు పెట్టుకుంది.