ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ ఈ ఏడాది ఉత్తమ యాప్స్ జాబితాను ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 'షాప్సీ' ఈ ఏడాది ఎక్కువ ఆదరణ పొందిన యాప్‌గా నిలిచింది. ఎవరైనా సరే ఈ ఉత్పత్తులను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విక్రయించుకోవచ్చు.
విద్యార్థుల కోసం ఉద్దేశించిన 'క్వెస్ట్' కూడా అత్యుత్తమ యాప్‌గా నిలిచింది. కృత్రిమ మేధ ద్వారా విద్యార్థుల అవసరాలను తెలుసుకుని అందుకనుగుణంగా అభ్యసనాలను అందిస్తుంది.
సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన 'క్యాల్' అగ్రస్థానంలో నిలిచింది. వృద్ధులకు ప్రీపెయిడ్ కార్డులు అందించడం, వారి అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందించడం ఈ యాప్ ప్రత్యేకత.
బెస్ట్ హిడెన్ జెమ్స్ విభాగంలో 'బేబీజీ' యాప్ అగ్రస్థానంలో నిలిచింది. చిన్నారుల వృద్ధిని గుర్తించే ట్రాకర్ ఇది.
2016లో విడుదలైన లూడో కింగ్ యాప్‌కు ఇప్పటికీ ప్రజాదరణ కొనసాగుతోంది.